పాయల్ రాజ్‌పుత్‌కి అంత సీనుందా.?

- November 16, 2023 , by Maagulf
పాయల్ రాజ్‌పుత్‌కి అంత సీనుందా.?

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో పాయల్ రాజ్‌పుత్ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే సెన్సేషనల్ విజయాన్ని అందుకుందీ హాట్ బ్యూటీ.

అయితే, ఈ సినిమా ఆమెకు బోల్డ్ బ్యూటీ అనే ట్యాగ్ ఇవ్వడంతో ఆ తర్వాత కూడా అలాంటివే పలు అవకాశాలు రావడం తెలిసిందే. కానీ, ఆ ముద్ర వేయించుకోవడం ఇష్టం లేని పాయల్ రాజ్ పుత్.. కొన్ని అవకాశాల్ని వదిలేసుకుంది.

ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌తో ‘వెంకీ మామ’, రవితేజతో ‘డిస్కో రాజా’ వంటి సినిమాల్లో నటించింది పాయల్ రాజ్‌పుత్. కానీ హీరోయిన్‌గా చెప్పుకోదగ్గ ఫేమ్ సాధించలేకపోయింది.

తాజాగా పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకి తన డెబ్యూ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించడం విశేషం.

టైటిల్‌తోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రమోషన్లు కూడా బాగా చేస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమా కోసం మళ్లీ హాట్ అవతారమెత్తింది. బోల్డ్‌నెస్‌తో పాటూ మంచి మెసేజ్ కూడా ఈ సినిమాతో ఇవ్వబోతున్నానని చెబుతోంది.

ఈ శుక్రవారమే ‘మంగళవారం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మామూలుగా అయితే ఈ తరహా సినిమాల్ని పెద్దగా పట్టించుకోరు. కానీ, ఎందుకో తెలీదు ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. చూడాలి మరి, బజ్‌కి తగ్గట్లుగా ‘మంగళవారం’ ఆకట్టుకుంటే.. పాయల్ దశ తిరిగినట్లే మళ్లీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com