బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకి ‘యానిమల్’ గ్లామర్
- November 16, 2023
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్టింగ్‌లో రూపొందిన ఓటీటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ కొత్త సీజన్ స్టార్ట్ కానుంది.
ఈ సీజన్ కోసం పలువురు సెలబ్రిటీలతో బాలయ్య సిద్ధంగా వున్నారు. ఇంతవరకూ వచ్చిన రెండు సీజన్లూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయ్.
ఇక తదుపరి సీజన్ పైనా భారీగా అంచనాలు నెలకొనగా.. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సీజన్‌లో ‘యానిమల్’ టీమ్‌తో బాలయ్య సందడి చేయబోతున్నారనీ తెలుస్తోంది.
డిశంబర్ 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. అందులో భాగంగానే అన్‌స్టాపబుల్ షో ద్వారా తమ సినిమాని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోందట.
రీసెంట్‌గా బాలయ్య ‘భగవంత్ కేసరి’గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక, త్వరలో అన్‌స్టాపబుల్ తాజా సీజన్‌కి హోస్ట్‌గా తన వీర లెవల్ పర్‌ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.! అన్నట్లు ఈ ఎపిసోడ్‌లో ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో పాటూ హీరో హీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, రష్మిక మండన్నా హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







