కట్టె పొంగలి
- April 10, 2015ఈ వారం మీ కోసం కట్టె పొంగలి రెసిపీ తో రెడీ గా ఉన్నాం. మామూలుగా పొంగలి అంటే కాస్త మెత్తగా వండుతాం కానీ ఈ రెసిపీ లో పొంగలి డ్రై గా చేస్తున్నాం.
కావలసిన పదార్ధాలు:
- బియ్యం - 1 కప్పు
- పెసర పప్పు - 1/2 కప్పు
- కరివేపాకు - గుప్పెడు
- మిరియాలు - 1 టేబుల్ స్పూన్
- జీడిపప్పు - గుప్పెడు
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- అల్లం - 1 ఇంచ్
- పచ్చి మిర్చి- 3 (మీకు సరిపడా)
ముందుగా:
- ఒక మిక్సి లో మిరియాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి పేస్టు గా చేయాలి.
చేయు విధానం:
- బియ్యం మరియు పెసరపప్పు పైన చెప్పిన కొలతలో (1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీరు పోయాలి) 3 కప్పుల నీరు పోసుకొని ప్రెషర్ కుక్కర్ లో 4 కూతలు వచ్చేదాకా వండాలి.
- కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసి ఉడికిన అన్నాన్ని చల్లారనివ్వండి.
- ఇప్పుడు ఒక చిన్న బాండి లో నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- అదే నెయ్యిలో మనం ముందుగా చేసి పెట్టుకున్నపేస్టు ని, కరివేపాకు, కొద్దిగా మిరియాలు వేసి ఒక 2 నిముషాలు వేయించండి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నం లో కలపండి.
- వేయించి పెట్టుకున్న జీడిపప్పు పైన చల్లుకొని సర్వ్ చేసుకోవటమే.
---- వి. జానకి జ్యోతి, అబు ధాబి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







