ఇన్ఫ్లుయెన్సర్లందరూ 9 శాతం కార్పొరేట్ పన్ను చెల్లించాలి..
- November 17, 2023
యూఏఈ: యూఏఈ-ఆధారిత ఇన్ఫ్లుయెన్సర్లందరూ 9 శాతం కార్పొరేట్ పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా ఫెడరల్ టాక్స్ అథారిటీలో నమోదు చేసుకోవాలి. యూఏఈ యొక్క ఫెడరల్ డిక్రీ-లా నం. 47 ఆఫ్ కార్పొరేషన్లు మరియు వ్యాపారాల పన్నుపై చేసిన చట్టం 2022 జూన్ 1, 2023 నుండి అమలులోకి వచ్చింది. దీని ద్వారా మొట్టమొదటి ఫెడరల్ కార్పొరేట్ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. యూఏఈలో సంవత్సరానికి AED375,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తులు అందరూ తప్పక 9 శాతం కార్పొరేట్ పన్ను చెల్లించాలి. అలాగే టాక్స్ కట్టే వారందరూ ఫెడరల్ టాక్స్ అథారిటీలో నమోదు చేసుకోవాలి. "యూఏఈలో లాభాలను ఆర్జించే లక్ష్యంతో పనిచేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లందరూ కార్పొరేట్ పన్ను చట్టం పరిధిలోకి వస్తారు కాబట్టి, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA)లో నమోదు చేసుకోవడం, వారి ఆదాయాలను నివేదించడం తప్పనిసరి." అని BSA లీగల్‌లో అసోసియేట్ మరూన్ అబౌ హర్బ్ తెలిపారు. EMARATAX ప్లాట్‌ఫారమ్‌లో కార్పొరేట్ పన్ను రిజిస్ట్రేషన్ నంబర్ (CTRN)ని పొందేందుకు టాక్స్ పేయర్స్ అందరూ తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పన్ను చెల్లింపు నుండి మినహాయించబడిన వారు కూడా, సంబంధిత పన్ను వ్యవధి ముగిసిన తొమ్మిది నెలలలోపు అన్ని సంబంధిత సహాయక డాక్యుమెంటేషన్లతో సహా ప్రతి పన్ను కాలానికి పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయాలని చెప్పారు. పన్ను ఎగవేతదారులకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే ప్రమాదం ఉందన్నారు. అలాగే పన్ను ఎగవేత మొత్తానికి మూడు రెట్లు జరిమానా విధించవచ్చని అబౌ హర్బ్ చెప్పారు. కొన్ని సందర్భాల్లో క్రిమినల్ పెనాల్టీలతో పాటు పన్ను ఎగవేతదారులు చెల్లించని పన్నుపై వడ్డీ మరియు జరిమానాలు వంటి సివిల్ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. వ్యాపారులు లేదా వ్యక్తులు కార్పొరేట్ పన్ను నియమాలను జాగ్రత్తగా పాటించాలి. ఆలస్యమైన లేదా మిస్సింగ్ అయిన రిజిస్ట్రేషన్, డీరిజిస్ట్రేషన్, పన్ను రిటర్న్‌లు, డిక్లరేషన్లు మరియు చెల్లింపులకు జరిమానాలు ఎదురుకోవాల్సి వుంటుంది. వీటితో పాటు సరైన రికార్డులను మెయింటెయిన్ చేయక పోవడం, పునరావృతమైన నేరాలు, తప్పు రిటర్నులను సమర్పించడం వంటి వాటికి అధిక జరిమానాలు విధించే అవకాశం ఉంద. అలాగే అధికారులకు అరబిక్ పత్రాలను అందించడంలో విఫలమైన వారు కూడా జరిమానాలను ఎదుర్కొంటారని మరూన్ అబౌ హర్బ్ వివారించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఢిఫెన్స్ సిబ్బందిని ప్రశంసించిన కింగ్ హమద్..!!
- కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ఆవిష్కరణ..!!
- మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం ప్రారంభం..!!
- ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్