'రైల్ హమ్సఫర్ సప్తాహ్' ఈ నెల 26 నుంచి జూన్ 1 వరకు..
- May 25, 2016
గత రెండేళ్లుగా చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలపై ఈ నెల 26 నుంచి జూన్ 1 వరకు దక్షిణ మధ్య రైల్వే 'రైల్ హమ్సఫర్ సప్తాహ్' కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా, అదనపు జనరల్ మేనేజర్, వివిధ డివిజన్లకు చెందిన డివిజినల్ రైల్వే మేనేజర్లు, అధికారులు ఈ వారోత్సవాల్లో పాల్గొంటారు. మొదటి రోజు 'స్వచ్ఛ దివస్' నిర్వహిస్తారు. 2వ రోజు 'సత్కార్ దినోత్సవ్'లో భాగంగా స్టేషన్లు, రైళ్లలోని ఆహార కేంద్రాల్లో పరిశుభ్రత, తినుబండారాల నాణ్యతాప్రమాణాలు, తాగునీటి సదుపాయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. మూడో రోజు 'సేవా దివస్'లో భాగంగా అన్ని రైళ్లలో సదుపాయాలు, సేవలపై ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటారు.ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపడతారు. 4వ రోజు సతర్కతా దినోత్సవంలో భాగంగా అన్ని రైళ్లు నిర్ణీత సమయానికి అనుగుణంగా నడుస్తున్నదీ లేనిదీ తనిఖీలు చేస్తారు. 5వ రోజు 'సామంజస్య దినోత్సవ్'లో భాగంగా అన్ని రైల్వే కాలనీల్లో ఇళ్ల నిర్వహణ, పరిశుభ్రతలపై తనిఖీలు నిర్వహిస్తారు. 6వ రోజు నిర్వహించే 'సంయోజన్ దినోత్సవ్'లో పెద్ద ఎత్తున సరుకు రవాణా చేసే ఖాతాదారులతో జనరల్ మేనేజర్, డీఆర్ఎంలు సమావేశాలు నిర్వహించి రవాణా విభాగంలో రైల్వేశాఖ సంస్కరణలను వివరిస్తారు. 7వ రోజు జూన్ 1వ తేదీన జరిగే 'సంచార్ దినోత్సవ్'లో ఈ వారోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమాలను సమీక్షిస్తారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







