1.2 మిలియన్ సౌదీ రియాల్స్ రైతు రుణమాఫీ
- May 25, 2016
కింగ్ సల్మాన్, 1.2 బిలియన్ రైతు రుణాల్ని మాఫీ చేశారు. కరువు ప్రభావంతో విలవిల్లాడుతున్న రైతులకు ఇది చాలా ఊరటనిచ్చే అంశం. ఈ రుణమాఫీతో 38,774 మంది అరేబియన్ షీల్డ్ ప్రాంతంలోని రైతులు లబ్ది పొందుతారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితుల్ని అధ్యయనం చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ నాయకత్వం, ప్రజల భద్రతకు కట్టుబడి ఉందనీ, మంచి జీవితం గడిపేందుకు దేశ నాయకత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా మినిస్టర్ ఆఫ్ వాటర్, ఎన్విరాన్‌మెంట్ అగ్రికల్చర్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఫద్లి చెప్పారు. అగ్రికల్చర్ సెక్టార్స్‌కి మద్దతివ్వడంలో బాగంగా ఈ రుణమాఫీ జరుగుతున్నట్లు అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ పండ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ జనరల్ చెప్పారు. మక్కా, మదీనా, అసిర్, అల్ బాహా, జజాన్, రియాద్, కాస్సిమ్, హైల్ మరియు తబుక్ ప్రాంతాల్లో కరువు కరాళనృత్యం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







