‘వార్ 2’లో ఎన్టీయార్‌కి జోడీ ఎవరో తెలుసా.?
- November 22, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీయార్‌కి బాలీవుడ్ నుంచి బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. అదే ‘వార్ 2’. ‘వార్’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హృతిక్ రోషన్‌కి ధీటైన ప్రతినాయకుడి పాత్రలో ఎన్టీయార్ నటిస్తున్నాడు.
భీభత్సమైన యాక్షన్ ఘట్టాలు.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకి సంబంధించి ఓ అప్టేట్ తాజాగా చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే, ఎన్టీయార్‌కి జోడీగా శర్వరి హీరోయిన్‌గా నటిస్తోందట. ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ సక్సెస్ అవుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడికి ఏకంగా గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ సరసన నటించే ఛాన్స్ వచ్చేయడం నిజంగా అదృష్టమే. అయితే, ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, ఒకవేళ నిజమే అయితే, ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్‌లోనూ మార్మోగిపోవడం ఖాయం. చూడాలి మరి.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







