‘ఆది కేశవ్’ లో వైష్ణవ్ తేజ్ డబుల్ రోల్ నిజమేనా.!

- November 22, 2023 , by Maagulf
‘ఆది కేశవ్’ లో వైష్ణవ్ తేజ్ డబుల్ రోల్ నిజమేనా.!

మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ ఈ వారం ‘ఆది కేశవ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవంబర్ 10న రావల్సిన ఈ సినిమా 24కి పోస్ట్ పోన్ అయ్యింది.

ఈ శుక్రవారం రిలీజ్‌కి ముస్తాబైన ‘ఆది కేశవ్’ సినిమా గురించి పలు రకాల అనుమానాలు ఫ్యాన్స్‌లో నెలకొన్నాయ్. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అంతకు ముందు నుంచీ వస్తున్న ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేలా వున్నాయ్. ఇక తాజాగా ట్రైలర్ చూశాకా, దైవత్వానికి సంబందించిన చిన్న పాయింట్ ఏదో ఈ సినిమాలో వుందని హింట్ ఇచ్చారు.

ఇంతవరకూ క్యూట్ అండ్ లవ్‌లీ రొమాంటిక్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా ప్రొజెక్ట్ అయిన ‘ఆది కేశవ్’ సడెన్‌గా డిఫరెంట్ టర్న్ తీసుకుంది. దాంతో, అంచనాలు మరింత పెరిగాయ్.

అంతేకాదు, సినిమాలో వైష్ణవ్ తేజ్ క్యారెక్టర్‌కి సంబంధించి రెండు పేర్లు వినిపిస్తున్నాయ్. ‘బాల కోటయ్య’, రుద్ర కాళేశ్వర్’ అని ఇంకో పేరు వినిపిస్తోంది.

అంటే వైష్ణవ్ తేజ్ డబుల్ రోల్‌లో కనిపించబోతున్నాడా..? అనే అనుమానాలు మొదలయ్యాయ్. ఈ అనుమానాలు తీరాలంటే నవంబర్ 24 వరకూ ఆగాల్సిందే. అన్నట్లు ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com