శబరిమల అయ్యప్ప భక్తులకు అలెర్ట్..

- November 24, 2023 , by Maagulf
శబరిమల అయ్యప్ప భక్తులకు అలెర్ట్..

బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని పలు ప్రాంతాలతో సహా కేరళ, తమిళనాడులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ఈ వారంలో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను కారణంగా దక్షిణ భారతదేశంలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కోస్టల్ కర్నాటక, దక్షిణ ఇంటీరియర్ కర్నాటక ప్రాంతాలలో భారీ వర్షాలు, కేరళ-మహేలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ లో 26 వరకు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాలు లేవని స్పష్టం చేసింది.
మరోవైపు కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
రెడ్ అలర్ట్ నేపథ్యంలో ప్రకృతి విపత్తులు కూడా సంభవించే ప్రమాదం కూడా ఉందని సూచించారు.

మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో.. కొండ ప్రాంతాల్లో పర్యటించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు అధికారులు.కొండచరియలు విరిగిపడడం లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో శబరిమల వెళ్ళే అయ్యప్ప స్వామి భక్తులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా.. రాత్రి వేళల్లో శబరిమలకు వెళ్లే సమయంలో, తిరిగి ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని యాత్రికులకు సూచించారు అధికారులు.
మరోవైపు.. సహాయక బృందాలు అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది కేరళ ప్రభుత్వం. ఇక.. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు భారీ వర్షం అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com