బహ్రెయిన్‌లో లైసెన్స్ లేని కాస్మెటిక్ ప్రాక్టీషనర్ అరెస్ట్

- November 25, 2023 , by Maagulf
బహ్రెయిన్‌లో లైసెన్స్ లేని కాస్మెటిక్ ప్రాక్టీషనర్ అరెస్ట్

బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని ఒక హోటల్‌లో సరైన లైసెన్స్ లేకుండా ఫిల్లర్లు , బొటాక్స్‌తో సహా సౌందర్య వైద్య సేవలను అందించిన మహిళను పబ్లిక్ ప్రాసిక్యూషన్ అరెస్టు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ సేవలను ప్రమోట్ చేసిన మహిళను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ పట్టుకుంది. ఆమె అరెస్టు సమయంలో గణనీయమైన పరిమాణంలో లైసెన్స్ లేని మరియు నమోదుకాని మందులు స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమగ్ర విచారణను ప్రారంభించింది. అనధికార ఔషధం, ఫార్మసీ మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించినట్లు విచారణలో గుర్తించారు. దీంతో ఆమెపై చట్టపరమైన అనుమతి లేకుండా డ్రగ్స్ నిల్వ సంబంధిత కేసులను నమోదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచురణలను ఉపయోగించారని, ఆమెకు వైద్యం చేసే అర్హతలు ఉన్నాయని తప్పుడు ధృవీకరణలు కలిగిఉన్నారని ఆమెపై అభియోగాలు నమోదు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. మహిళను రిమాండ్‌కు తరలించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com