దుబాయ్ మెట్రో బ్లూ లైన్ ప్రాజెక్ట్‌కు ఆమోదం
- November 25, 2023
దుబాయ్: 30కిమీ దుబాయ్ మెట్రో బ్లూ లైన్ ప్రాజెక్ట్‌కు యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ సుమారు 1 మిలియన్ ప్రజలకు విస్తృత సేవలను అందించనుంది. ఎమిరేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో సరికొత్త ప్రాజెక్ట్ 18 బిలియన్ దిర్హామ్‌లతో నిర్మించబడుతుందని షేక్ మొహమ్మద్ ట్విటర్(ఎక్స్)లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రెడ్ మరియు గ్రీన్ మెట్రో లైన్లకు బ్లూ లైన్ ను అనుసంధానం చేయనున్నారు. దీని మొత్తం పొడవు 30 కి.మీ ఉంటుంది, ఇందులో 15.5 కి.మీ భూగర్భంలో ఉంటుంది (70 మీటర్ల లోతులో) మరియు 14.5 కి.మీ ఎలివేటెడ్ రైలు ఉంటుంది. బ్లూ లైన్ సేవలు దుబాయ్ ఫెస్టివల్ సిటీ, దుబాయ్ క్రీక్ హార్బర్, ఇంటర్నేషనల్ సిటీ, అల్ రషీదియా, అల్ వార్కా, మిర్డిఫ్, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్, అకాడెమిక్ సిటీ ఇతర పొరుగు ప్రాంతాలకు అందుబాటులో ఉండనున్నాయి. 2029 నాటికి అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, ప్రతిరోజూ దాదాపు 320,000 మంది కొత్త ప్రయాణీకులకు సేవలు అందిస్తుందన్నా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







