గల్ఫ్ ఎయిర్ రిపోర్ట్స్ డేటా బ్రీచ్.. ప్రభావితం కాని ఆపరేషన్స్
- November 26, 2023
బహ్రెయిన్: గల్ఫ్ ఎయిర్ నవంబర్ 24న డేటా చోరీ ఘటన నమోదైనట్లు వెల్లడించింది. దాని IT సిస్టమ్‌పై గుర్తు తెలియని హ్యాకర్స్ దాడి చేశారని, ఇమెయిల్ మరియు క్లయింట్ డేటాబేస్ సమాచారాన్ని చోరీ చేసే యత్నం జరిగిందన్నారు. "నవంబర్ 24న దాని IT సిస్టమ్‌ను లక్ష్యంగా చేసుకున్న డేటా ఉల్లంఘన సంఘటన చోటుచేసుకుంది. అనధికార యాక్సెస్ కారణంగా దాని ఇమెయిల్ మరియు క్లయింట్ డేటాబేస్ నుండి కొంత సమాచారం చోరీ అయి ఉండవచ్చు." అని ఎయిర్‌లైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. వెంటనే అత్యవసర సెక్యూరిటీ సిస్టమ్ ను యాక్టివేట్ చేసినట్లు గల్ఫ్ ఎయిర్ తెలిపింది. ఈ సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు పేర్కొంది. జాతీయ క్యారియర్ వినియోగదారులకు ఏదైనా అసౌకర్యం కలిగించినందుకు విచారం వ్యక్తం చేసింది. గల్ఫ్ ఎయిర్ ఇలాంటి విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటుందని, ఈ సంఘటన వల్ల తమ విలువైన కస్టమర్లకు ఏదైనా అసౌకర్యం కలిగితే చింతిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్







