39 మంది పాలస్తీనియన్లను విడుదల చేసిన ఇజ్రాయెల్
- November 26, 2023
ఇజ్రాయెల్: శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన ఒప్పందం ప్రకారం హమాస్ 13 మంది బందీలను విడిచిన తర్వాత 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసినట్లు ఇజ్రాయెల్‌లోని జైలు అధికారులు ఆదివారం తెల్లవారుజామున ప్రకటించారు. విముక్తి పొందిన పాలస్తీనా ఖైదీలలో మహిళలు ఉండగా.. హమాస్ విడుదల చేసిన బందీలలో మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. ఈ ఒప్పందం నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. 50 మంది ఇజ్రాయిలీలను మరియు 150 మంది పాలస్తీనియన్లను విడుదల చేయడానికి సంధీ కుదిరింది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు 39 మందిని విడుదల చేసిన అదే రోజున 17 మంది పాలస్తీనియన్లను అరెస్టు చేసినట్లు పాలస్తీనియన్ ప్రిజనర్స్ క్లబ్ అడ్వకేసీ గ్రూప్ నివేదించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!