ఇజ్రాయెల్ చేరుకున్న13 ఇజ్రాయిలీలు, 4 థాయ్ జాతీయులు
- November 27, 2023
యూఏఈ: 13 మంది ఇజ్రాయెల్‌లు మరియు నలుగురు థాయ్ జాతీయులను రెండో విడతలో హమాస్ విడుదల చేసింది. వారంతా ఆదివారం ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఈజిప్ట్ మరియు ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా బందీల అప్పగింత, గాజాలోకి సహాయ సామగ్రి తరలింపు ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 150 మంది ఖైదీలకు బదులుగా హమాస్ 50 మంది బందీలను విడుదల చేయనుంది. హమాస్ బందీలను శనివారం అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీకి అప్పగించింది. విడుదలైన 13 మంది ఇజ్రాయెల్‌లలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. విడుదల చేయబడిన బందీలు ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులకు తరలించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనియన్లను రెండు జైళ్ల నుండి విడుదల చేసిందని పాలస్తీనా వార్తా సంస్థ WAFA వెల్లడించింది. హమాస్ చెరలో 240 మంది బందీలుగా ఉన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి