పసిడి ధర గురువారం స్వల్పంగా పెరిగింది
- May 26, 2016
పసిడి ధర గురువారం స్వల్పంగా పెరిగింది. బుధవారం ఆరువారాల కనిష్ఠానికి చేరిన దీని ధర ఈ రోజు రూ.25 పెరిగింది. దీంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,225కు చేరింది. ప్రపంచ మార్కెట్లలో ధర పెరుగుతుండటం, దేశీయంగా రీటైల్ మార్కెట్లలో కొనుగోళ్లు వూపందుకోవడంతో నగల వ్యాపారులు కొనుగోళ్లకు దిగడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.8శాతం పెరిగి 1,234.36 యూఎస్ డాలర్లకు చేరింది.వరసగా ఎనిమిది రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ఈ రోజు మాత్రం పెరిగింది. రూ.150 పెరగడంతో కేజీ వెండి ధర రూ.39,600కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయడంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







