కాజల్ ఇంకొన్నాళ్లు హీరోయిన్గా పక్కా.!
- November 29, 2023
‘భగవంత్ కేసరి’లో కాజల్ అగర్వాల్‌కి మంచి రోల్ దక్కింది. సైకియాట్రిస్ట్ కాత్యాయని పాత్రలో కాజల్ నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో కాజల్ చక్కగా ఒదిగిపోయింది. కాస్త బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ బాలయ్యకు సరిజోడీగా వయసుకు తగ్గ పాత్రలా అనిపించింది.
ఇంతవరకూ గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన కాజల్ అగర్వాల్ ఇకపై ప్రాధాన్యత వున్న పాత్రల్లో ఎలా మెప్పించగలదో అన్న ప్రశ్నకు ఈ సినిమాతో చక్కగా సమాధానమిచ్చేసింది కాజల్ అగర్వాల్.
డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కాజల్ అగర్వాల్‌ని అలా వాడాడు మరి. ఇదిలా వుంటే, బాలయ్య, కాజల్ జోడీ చూశాకా, చిరంజీవి సరసన కూడా కాజల్ అగర్వాల్ బాగుంటుందని ఓ అంచనాకి వచ్చేశారు అభిమానులు.
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమాకి హీరోయిన్ అవసరం వుంది. పలువురు సీనియర్ భామల పేర్లు పరిశీలిస్తున్నారు. కానీ, ఫైనల్ చేయలేదు.
ఎలాగూ ‘ఆచార్య’ మిస్ అయ్యింది కాబట్టి, కాజల్‌ని ‘విశ్వంభర (వర్కింగ్ టైటిల్)’ కోసం తీసుకుంటే బాగానే వుంటుందనేది ప్రేక్షకుల అభిప్రాయం. చూడాలి మరి, చిత్ర యూనిట్ ఈ కాంబో పట్ల ఎలాంటి ఆలోచన చేయనుందో.! అన్నట్లు చిరంజీవితో ఛాన్స్ వస్తే.. ఠక్కున అందుకోవడానికి కాజల్ రెడీగా వుందట.!
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







