చికెన్‌ టిక్కీలు

- May 26, 2016 , by Maagulf
చికెన్‌ టిక్కీలు

కావలసిన పదార్థాలు: (దంచిన) చికెన్‌ - అరకేజీ, శనగపప్పు - అరకప్పు, నీరు - 1 కప్పు, ఉప్పు - తగినంత, ఉల్లి తరుగు - అరకప్పు, అల్లం తరుగు - 1 టీ స్పూను, జీరా, యాలకుల పొడి - అర టీ స్పూను చొప్పున, దనియాపొడి - 1 టీ స్పూను, చిదిమిన లవంగాలు - 2, గరం మసాల - 1 టీ స్పూను, కొత్తిమీర తరుగు - పావు కప్పు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, గిలకొట్టిన గుడ్లు - 2.

తయారుచేసే విధానం: ఒక పాత్రలో చికెన్‌, శనగపప్పు, నీరు, చిటికెడు ఉప్పు వేసి పప్పు మెత్తబడేవరకు ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లి, మిగతా మసాల పొడులతో పాటు మరికొద్ది ఉప్పు వేసి రుబ్బి చికెన్‌ మిశ్రమలో కలపాలి. ఈ ముద్దని అరంగుళం మందంతో, వడల్లా వత్తుకుని ఫ్రిజ్‌లో అరగంటసేపు ఉంచాలి. తర్వాత గుడ్డుసొనలో ముంచి నూనె రాసిన పెనంపై రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. పెరుగు చట్నీ మంచి కాంబినేషన్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com