తెలంగాణలో జనసేన బోణీ కొట్టేనా.?
- November 30, 2023
2019 ఎన్నికల్లో తెలంగాణలో జీరో సీట్లు దక్కాయ్ జనసేన పార్టీకి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ పార్టీ ఓ సీటు గెలుచుకుంది. అయితే, ఈసారి తెలంగాణలో జనసేన పుంజుకున్నట్టేనన్న చర్చ అంతటా జరుగుతోంది.
బీజేపీ సాయంతో జనసేన పార్టీ ఎనిమిది చోట్ల తెలంగాణలో పోటీ చేస్తోంది. మిగతా చోట్ల బీజేపీ, జనసేన సాయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు రెండు పార్టీల అభ్యర్థుల తరఫున.
అయితే, మరింత ప్రత్యేక దృష్టి కూకట్‌పల్లి మీద పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారం కూకట్‌పల్లిలో జనసేన తరఫున మరింత ఉధృతంగా జరిగింది. జనసేన అభ్యర్థి కూడా, మిగతా జనసేన అభ్యర్థుల కంటే జోరుగా ప్రచారం చేయడం గమనించదగ్గ అంశం.
తెలంగాణలో గనుక జనసేన బోణీ కొట్టగలిగితే, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనూ వుంటుందని జనసేన పార్టీ భావిస్తోంది. మొత్తం ఎనిమిది చోట్ల జనసేన పోటీ చేయగా, మూడు చోట్ల గట్టి పోటీ వుంటుందనీ, మిగతా చోట్ల నామ మాత్రంగానే జనసేనకు ఓట్లు పడతాయనీ అంటున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







