ఓటుకు నోటు.! ఓటర్లను కొనేస్తున్న కరెన్సీ నోట్లు.!
- November 30, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా, కరెన్సీ నోటు డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రచారం ముగిశాక, ఓట్లను కొనేందుకు రాజకీయ పార్టీలు తమవైన వ్యూహాల్ని అమల్లోకి తెచ్చాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఓటర్లను కొనుగోలు చేయడం.. అనే రాజకీయ ఎత్తుగడని మాత్రం ఈసారి కూడా నిలువరించలేకపోవడం గమనించాల్సిన విషయం.
‘మీ ఓటుని అమ్ముకోవద్దు..’ అని ఎవరెంతలా నచ్చజెబుతున్నా, చాలామంది ఓటర్లు తమ ఓటుని నిర్మొహమాటంగా అమ్మేసుకుంటున్నారు. పైగా, తాము అడిగినంత రేటు ఇవ్వడంలేదంటూ ఓటర్లు మీడియాకెక్కుతుండడం కూడా అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను కొనుగోలు చేయడంలో బిజీ అయిపోయాయి. పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ, చాటు మాటుగా ఓట్ల కొనుగోళ్ళు జరుగుతున్నాయి.
అయితే, ఇలా ఓట్లు అమ్ముకునేవారి సంఖ్య చాలా తక్కువగానే వుంటుందనే వాదనా లేకపోలేదు. ఎవరి గోల వారిది.! అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని కరెన్సీ నోటు అపహాస్యం చేస్తోందన్నది మాత్రం నిర్వివాదాంశం.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







