తెలంగాణలో గెలిచేది ఈ పార్టీనే..!

- November 30, 2023 , by Maagulf
తెలంగాణలో గెలిచేది ఈ పార్టీనే..!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైంది. డిసెంబర్ 3న ఫలితం వెలువడనుంది. ఈసారి ఓటరు దేవుడు ఎవరికి పట్టం కట్టాడు? ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అన్నది తెలియాలంటే డిసెంబర్ 3వరకు ఆగాల్సిందే.

తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సాధిస్తారా? తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్‌కు ఓటు వేశారా‎? పోరుగడ్డలో బీజేపీ గెలవబోతున్న స్థానాలెన్ని‎? ప్రజా తీర్పు ఏ విధంగా ఉండనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..

సీఎన్ఎన్-న్యూస్ 18
బీఆర్ఎస్ 48
కాంగ్రెస్+ 56
బీజేపీ+ 10
ఎంఐఎం 05

థర్డ్ విజన్ ఎగ్జిట్ పోల్..
బీఆర్ఎస్ 61-68
కాంగ్రెస్+ 34-10
బీజేపీ+ 03-05
ఇతరులు 05-08

సర్వే సంస్థ – పొలిటికల్ గ్రాఫ్
బీఆర్ఎస్ – 68
కాంగ్రెస్+ – 38
బీజేపీ+ – 05
ఇతరులు – 08

సర్వే సంస్థ – ఆత్మ సాక్షి
బీఆర్ఎస్ – 58-63
కాంగ్రెస్+ – 48-51
బీజేపీ – 07-08
ఇతరులు – 07-09

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com