గాజా సంధిని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ఇజ్రాయెల్
- November 30, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ అధికారులు గురువారం గాజా యుద్ధంలో విరామం(సంధి) పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇది మరింత మంది బందీలను మరియు ఖైదీలను విడుదల చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ (ఎక్స్) వేదికగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి.
ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం.. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి దాదాపు 240 మందిని కిడ్నాప్ చేసింది. హమాస్ అధికారుల ప్రకారం.. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 15,000 మంది మరణించారు. గాజా ఉత్తర ప్రాంతంలోని వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. నవంబర్ 24న సంధి ప్రారంభమైనప్పటి నుండి 210 మంది పాలస్తీనా ఖైదీలను, 70 మంది ఇజ్రాయెలీ బందీలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు. వీరిలో దాదాపు 30 మంది విదేశీయులు ఉన్నాయి. బందీలను విడిపించేందుకు ఉద్దేశించిన తాత్కాలిక విరమణగా సంధిని చూస్తున్నట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు UN సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నిజమైన మానవతావాద కాల్పుల విరమణ కావాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







