తెలంగాణలో గెలిచేది ఈ పార్టీనే..!
- November 30, 2023
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైంది. డిసెంబర్ 3న ఫలితం వెలువడనుంది. ఈసారి ఓటరు దేవుడు ఎవరికి పట్టం కట్టాడు? ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అన్నది తెలియాలంటే డిసెంబర్ 3వరకు ఆగాల్సిందే.
తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారా? తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్‌కు ఓటు వేశారా? పోరుగడ్డలో బీజేపీ గెలవబోతున్న స్థానాలెన్ని? ప్రజా తీర్పు ఏ విధంగా ఉండనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..
సీఎన్ఎన్-న్యూస్ 18
బీఆర్ఎస్ 48
కాంగ్రెస్+ 56
బీజేపీ+ 10
ఎంఐఎం 05
థర్డ్ విజన్ ఎగ్జిట్ పోల్..
బీఆర్ఎస్ 61-68
కాంగ్రెస్+ 34-10
బీజేపీ+ 03-05
ఇతరులు 05-08
సర్వే సంస్థ – పొలిటికల్ గ్రాఫ్
బీఆర్ఎస్ – 68
కాంగ్రెస్+ – 38
బీజేపీ+ – 05
ఇతరులు – 08
సర్వే సంస్థ – ఆత్మ సాక్షి
బీఆర్ఎస్ – 58-63
కాంగ్రెస్+ – 48-51
బీజేపీ – 07-08
ఇతరులు – 07-09
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







