రజనీకాంత్ కుటుంబ సమేతంగా అమెరికాకు పయనo
- May 26, 2016
'కబాలి' సినిమా షూటింగ్ పనులు పూర్తవటంతో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా అమెరికాకు పయనమయ్యారు. ఈ వేసవి సెలవులను ఆయన కుటుంబ సభ్యులతో అమెరికాలోనే గడుపనున్నారు. రజనీకాంత్‌తో పాటు ఆయన అల్లుడు, యువనటుడు ధనుష్, పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా అమెరికా వెళ్లారు. కళైపులి ఎస్.థాను నిర్మిస్తోన్న కబాలి సినిమా షూటింగ్ పనులన్నీ ఇటీవలే ముగిశాయి. ఈ చిత్రం జూలైలో విడుదల చేయటానికి సన్నాహాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతోపాటు రజనీకాంత్ రెండు రోజులకు ముందు అమెరికాకు బయల్దేరి వెళ్ళారు. ఆయనతో పాటు కొంతమంది స్నేహితులు కూడా వెళ్లారని తెలుస్తోంది. 'కబాలి' చిత్రం తర్వాత రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో '2.0' చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. తదుపరి షెడ్యూల్ జూన్ రెండో వారంలో ప్రారంభం కానుంది. అందుకే ఈ గ్యాప్‌లో అమెరికాలో రెండు వారాలపాటు గడిపి, జూన్ మొదటివారంలో తిరిగిరానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







