రేపు హైదరాబాద్ లో 144 సెక్షన్
- December 02, 2023
హైదరాబాద్: రేపు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కౌంటింగ్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమిగూడొద్దని, వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మద్యం షాప్స్ కూడా బంద్ చేయాలనీ ఆదేశాలు జారీ చేసారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







