ఉదయం లేచిన వెంటనే ఒళ్లు నొప్పులు బాధిస్తున్నాయా.?

- December 02, 2023 , by Maagulf
ఉదయం లేచిన వెంటనే ఒళ్లు నొప్పులు బాధిస్తున్నాయా.?

ఒక వయసుకొచ్చాకా ఒళ్లు నొప్పులూ, ముఖ్యంగా మోకాలి నొప్పులూ సర్వ సాధారణం. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరే. వయసుతో అసలు సంబంధమే లేదు. చిన్న వయసులోనే మోకాలి నొప్పులు, చిన్న పని చేసినా భరించలేని ఒళ్లు నొప్పులు బాధిస్తున్నాయ్.
ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే కాలి నొప్పులతో పాటూ, ఒళ్లు నొప్పులు కూడా బాధిస్తున్నాయ్. కానీ, ఉరుకుల పరుగుల జీవితాలు.. నొప్పులు అని కూర్చోలేం.. అలాగని వాటిని అధిగమించలేం. అయితే, భరించలేని నొప్పుల్ని అశ్రద్ధ చేయరాదనీ, అవి ఎందుకు వస్తున్నాయో కారణం తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవడం లేదంటే కాస్తయినా రెస్ట్ తీసుకోవడం చేయాలని తాజాగా ఓ సర్వే ద్వారా ప్రూవ్ అయ్యింది.
అయితే, అసలు నిద్ర లేవగానే ఒళ్లు నొప్పిగా అనిపించడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. శరీరంలో డి విటమిన్, కాల్షియం లోపం కారణంగా ఒళ్లు నొప్పలు వస్తాయ్.
అలాగే, శరీరంలోని ముఖ్య అవయవాలైన కిడ్నీలు, ఎముకలు ఆరోగ్యంగా వుండాలంటే, శరీరానికి తగినంత విటమిన్ డి అవసరం. శరీరం కాల్షియంని గ్రహించడానికి మనకు తగినంత విటమిన్ డి అవసరం పడుతుంది.
అందుకే ఈ రెండు సమ పాళ్లలో తమ పనిని నిర్వర్తిస్తేనే ఎలాంటి నొప్పులూ, బాధలూ లేకుండా శరీర భాగాలు ఆరోగ్యంగా వుంటాయ్.
ఈ రెండింటిలో ఏ ఒకటి లోపించినా ఎముకల్లో నొప్పి మొదలవుతుంది. నిద్రపై అది ప్రభావం చూపిస్తుంది. నిద్ర లేవగానే ఒళ్లంతా ఆ నొప్పి విస్తరిస్తుంది. అందుకే కాల్షియం లోపం రాకుండా పాలు, పాల సంబంధిత పదార్ధాలు, గుడ్లు రెగ్యలర్‌గా తీసుకోవాలి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com