ఫిలిఫ్పీన్స్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..
- December 02, 2023
ఆసియా దేశం ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మిండనావోలో శనివరాం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC) తెలిపింది.భూమికి 63 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు చెప్పింది.
భారీ భూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ సునామీ హెచ్చరికల్ని జారీ చేసింది. గత నెల ప్రారంభంలో కూడా దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 6.7 భూకంపం సంభవించింది. దీంతో 8 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి.
పసిఫిక్ మహా సముద్రంలో 'పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్' అనే ప్రదేశంలో ఇండోనేషియా, ఫిలిఫ్పీన్స్, జపాన్ వంటి దేశాలు ఉన్నాయి. దీంతో అక్కడ తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు నిరంతరం చోటు చేసుకుంటాయి. దీంతో పాటు క్రియాశీలక అగ్నిపర్వతాలకు ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది. దీంతోనే ఇక్కడ తరుచుగా భూకంపాలు వస్తుంటాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







