వద్దు బాబోయ్ వద్దు.. ఆ డైరెక్టర్‌తో సినిమా వద్దే వద్దంటోన్న ఫ్యాన్స్.!

- December 02, 2023 , by Maagulf
వద్దు బాబోయ్ వద్దు.. ఆ డైరెక్టర్‌తో సినిమా వద్దే వద్దంటోన్న ఫ్యాన్స్.!

ప్రేమంటే పిచ్చి.. ప్రేమంటే ఇంకోటీ.. అనే అర్ధాలు చాలానే విన్నాం. కానీ, ఇదేం ప్రేమరా బాబోయ్.! అనుకునేలా తండ్రి మీద ప్రేమని చూపించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాలో.
విధ్వంసం అంటే ఇంతలా వుంటుందా.? మరీ డైరెక్షన్‌లో ఇంత కఠినత్వమా.? కఠినత్వం కాదు, మూర్ఖత్వం.. కాదు కాదు ఇంకేదో పేరు పెట్టాలి.. ఈ డైరెక్షన్‌కి.
సినిమా అంటే అర్ధమిదేనా.? సినిమా ద్వారా సందేశాలివ్వకపోయినా ఫర్వాలేదు. కానీ, ఇంతటి విధ్వంసాన్ని రెచ్చగొట్టేలా అస్సలుండకూడదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్ ‘యానిమల్’ సినిమాపై.
‘యానిమల్’, అర్జున్ రెడ్డీ’ ఒక్కటేనా.? అన్నందుకు మొన్న ఓ సినీ జర్నలిస్టుని ఏకి పారేశారంతా. కానీ, ‘అర్జున్ రెడ్డి’ ఒకింత యూత్ ఫుల్ మూవీ. కేవలం యూత్ కోసమే.. అనేస్తే కాస్త ఓకే. కానీ, ‘యానిమల్’ని ఎవరి కోసం సినిమా.? అనాలో అర్ధం కాని పరిస్థితి.. అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.
‘యానిమల్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా ప్రబాస్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. అదే ‘స్పిరిట్’. కానీ, ఈ సినిమా చూశాకా, ‘స్పిరిట్’లో ప్రబాస్‌ని ఇంకెలా చూపిస్తాడో అంటూ ప్రబాస్ ఫ్యాన్సే భయపడిపోతున్నారు. వద్దు బాబోయ్ వద్దు సందీప్‌తో సినిమా చేయనే వద్దు అంటూ ప్రబాస్‌ని హెచ్చరిస్తున్నారట.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com