దటీజ్ నితిన్.! పవన్ కళ్యాణ్ వీరాభిమాని అంతే.!
- December 02, 2023
ఒక్కసారి పవన్ కళ్యాణ్ అభిమాని అయితే, చచ్చేదాకా అంతే.. ఆయన ఫ్యాన్‌గానే వుండిపోతాం. అదీ పవన్ కళ్యాణ్ అంటే. అంటున్నాడు హీరో నితిన్. అవును.. పవన్ అభిమానుల్లో ఎవరిని కదిపినా ఈ మాటే వినిపిస్తుంది.
హీరో నితిన్ ఇంకాస్త ఎక్కువ. పవన్ కళ్యాణ్‌ని నితిన్ అభిమాని కాదు, వీరాభిమాని కాదు.. అరి వీర భక్తుడు.. తన సినిమాల్లో ఎక్కడో చోట పవన్ కళ్యాణ్ ప్రభావం వుండేలా చూసుకుంటాడు.
తాజాగా నితిన్ సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్’ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్లలో భాగంగా ఇదే ప్రశ్న నితిన్ ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్‌ని మీరు ప్రతీ సినిమాలోనూ వాడేస్తారు కదా.! స్టార్ డమ్ లేని టైమ్‌లో హీరోలు అలా చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఓ స్టార్ హీరో కదా.. ఇంకా ఎందుకు పవన్ కళ్యాణ్‌ని మీ సినిమాల్లో వాడడం.? అని అడిగితే. అది వాడకం కాదు.. అది ఆయనపై నాకున్న అభిమానం.
ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే, జీవితాంతం ఆయనకు ఫ్యాన్‌గానే వుండిపోతాను. చచ్చేవరకూ ఆయన అభిమానినే నేను. ఫేమ్ కోసం ఆయన్ని వాడుకుని.. పేమ్ రాగానే మాట మార్చే అభిమానిని కాదు నేను. ఎంత స్టార్‌డమ్ వచ్చినా నేనెప్పుడూ పవన్ కళ్యాణ్ అభిమానినే.. అని చెప్పి పవన్‌పై తనకున్న పిచ్చి అభిమానాన్ని మరోసారి కుండ బద్దలుకొట్టేశాడు హీరో నితిన్.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







