COP28లో ప్రసంగించిన దివంగత షేక్ జాయెద్

- December 03, 2023 , by Maagulf
COP28లో ప్రసంగించిన దివంగత షేక్ జాయెద్

యూఏఈ: COP28 సమావేశాల్లో యూఏఈ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పర్యావరణాన్ని పరిరక్షించడం అంటే ప్రపంచానికి సందేశం ఇచ్చారు. 3D హోలోగ్రామ్ టెక్నాలజీని ఆకట్టుకునే రీతిలో ఉపయోగించి ఆయనకు ప్రాణం పోశారు. ఎమిరాటీ జీవన విధానంలో సుస్థిరత ఎల్లప్పుడూ ఎలా భాగమైందో షేక్ జాయెద్ ప్రపంచ దేశాలకు వివరించారు. యూఏఈలో ఉన్న తమకు, పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు సంరక్షించడం అనేది ఒక నినాదం లేదా లోగో కాదని,  వాస్తవానికి ఇది ఒక చరిత్రగా, సంస్కృతిగా మరియు వారసత్వంగా భాగమన్నారు. తాము అలాగే ఉన్నామని, ఎల్లప్పుడూ ఉంటామని ప్రకృతి మరియు మానవుల సహజీవనానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఎమిరాటిస్‌ల పూర్వీకులు ప్రకృతి ప్రాముఖ్యతను తెలుసుకుని జీవించడానికి అవసరమైన వాటిని మాత్రమే తీసుకున్నారని ఆయన చెప్పారు. రాబోయే తరాలు చాలా భిన్నమైన ప్రపంచంలో వెళ్లిపోతాయని, అందుకే మనల్ని మరియు మన పిల్లలను మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com