గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన వాతావరణ కార్యకర్తలు

- December 04, 2023 , by Maagulf
గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన వాతావరణ కార్యకర్తలు

యూఏఈ: తాత్కాలిక సంధి ముగిసిన తరువాత గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.  గాజాలో బేషరతుగా మరియు తక్షణ కాల్పుల విరమణ  కోసం పిలుపునిస్తూ  200 మందికి పైగా పర్యావరణ కార్యకర్తలు కెఫియాలు ధరించి, బ్యానర్‌లు ఊపుతూ COP28 వేదిక వద్ద నిరసన చేపట్టారు. ఇజ్రాయెల్ బాంబు దాడి కారణంగా గాజాలో మరణించిన వారి పేర్లను పిలవడం ద్వారా UN-నియంత్రిత బ్లూ జోన్ లోపల నిరసన ప్రారంభమైంది.  ప్రాణాలు కోల్పోయిన 6 ఏళ్ల బాధితురాలి పేరును ఆమె ఉచ్చరించడంతో అనౌన్సర్ గొంతు వణికింది. మానవ హక్కులు లేకుండా వాతావరణ న్యాయం జరగదని నిరసనకారులు తీవ్రంగా నినాదాలు చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com