కుప్ప కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్లు మృతి

- December 04, 2023 , by Maagulf
కుప్ప కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్లు మృతి

తెలంగాణ: శిక్షణా యుద్ధ విమానం కుప్పకూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు పైలెట్లు మరణించారు. తెలంగాణలోని మెదక్‌ జిల్లాలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణంపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా పిలాటస్‌ పిసి 7 ఎంకె 11 విమానం హైదరాబాద్‌లోని ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ (AFA) నుండి బయలుదేరినట్లు వైమానిక దళం తెలిపింది. విమానం కూలిపోయే సమయంలో ఓ ట్రైనర్‌, ట్రైనీ పైలెట్లు ఉన్నారని, ప్రమాదంలో వారిద్దరూ మరణించారని వైమానిక దళం (IFA) ‘ఎక్స్‌’ లో పేర్కొంది. ఒకే ఇంజన్‌ కలిగిన పిలాటస్‌ పిసి 7 ఎంకె 11 విమానాన్ని ఐఎఎఫ్‌ పైలెట్లు శిక్షణ పొందేందుకు వినియోగిస్తుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com