అయోధ్య రాముడి ఆలయ ప్రారంభోత్సవానికి 6వేల మందికి ఆహ్వానం
- December 04, 2023
అయోధ్య: యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య లో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠను 2024 జనవరి 22 మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇక ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







