ముగిసిన CLP సమావేశం

- December 04, 2023 , by Maagulf
ముగిసిన CLP సమావేశం

హైదరాబాద్: గచ్చిబౌలిలోని హోటల్‌ ఎల్లాలో సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 64మంది ఎమ్మెల్యేలు హాజరైయ్యారు. సిఎం ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధిష్ఠానానికి అప్పగించాలని సీఎల్పీ ఏక వాఖ్య తీర్మానం చేసింది. రేవంత్ రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీర్మానాన్ని బలపరిచారు. మరో రెండు గంటల్లో సీఎల్పీ నేతను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం చేసింది. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎల్పీ తీర్మానం చేసింది. సాయంత్రం 4 గంటల తరువాత పొలిటికల్ అపాయింట్మెట్ తీసుకున్నట్లు రాజ్ భవన్ అధికారులు తెలిపారు. రాజ్ భవన్ కు అవసరమైన సామాగ్రి చేర్చాలని కోరినట్లు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశానికి ముందు కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ భేటీ అయ్యారు. పార్క్‌హయత్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి సోదరులతో వివిధ అంశాలపై డీకే చర్చలు జరిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com