తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా భట్టి, సీతక్క
- December 04, 2023
హైదరాబాద్: తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ రాత్రి రాత్రి 8:15 గంటలకు రాజ్ భవన్ లో వీరి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను సోమవారం ఉదయం ఏఐసీసీ పరిశీలకులు స్వీకరించారు. సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానంను రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో సహా ఇతర ఎమ్మెల్యేలు బలపర్చారు.
ఈ తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులు అధిష్టానానికి పంపించారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎల్పీ నేత పేరును అధికారికంగా ప్రకటించటంతో రేవంత్ రెడ్డి సీఎంగాను.. డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాత్రి 8.15 గంటలకు వీరితో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్‌కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్‌లో ఎఫ్‌టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్‌లో నిల్వ ఉన్న ఇరాన్‌కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







