ప్రపంచవ్యాప్తంగా చంద్రమోహనునికి ఘన నివాళి
- December 04, 2023
వంశీ ఇంటర్నేషనల్ మరియు శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల స్వర్గస్తులైన ప్రముఖ సినీ నటులు చంద్రమోహన్ కి నివాళిగా, అంతర్జాల మాధ్యమంగా శనివారం సంస్మరణ సభ నిర్వహించబడింది. పలువురు సినీ ప్రముఖులు చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులు, ఆప్తులు, వివిధ దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ నటనా విశిష్టతను గూర్చి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి ఎన్నో విషయాలను పంచుకున్నారు.
చంద్రమోహన్ తో 21 సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు తనకు వారితో ఉన్న అనుబంధాన్ని ఈ వేదికపై తలచుకున్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ చంద్రమోహన్ మరియు వారి సతీమణి జలంధర తో తమకున్న ప్రత్యక్ష స్నేహ సంబంధాన్ని గూర్చి తెలిపారు. తాను రాసిన మొట్టమొదటి గీతం చంద్రమోహన్ కే రచించానని తెలియజేశారు. చంద్రమోహన్ మేనల్లుడు ప్రముఖ సినీ నిర్మాత ఆయన శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తన మామయ్య యొక్క ఉన్నత వ్యక్తిత్వాన్ని గూర్చి, ఆదిత్య 369 సినిమా అనుభవాలను గూర్చి ఎన్నో విషయాలను పంచుకున్నారు.
కార్యక్రమ ప్రధాన నిర్వాహకులైన డాక్టర్ వంశీ రామరాజు, కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం వంశీ ప్రచురణగా చంద్రమోహన్ నటనా వైదుష్యాన్ని తెలియజేస్తూ 120 సినిమా సమీక్ష వ్యాసాలతో ప్రచురింపబడిన "సినితెర చంద్రమోహనం" పుస్తకాన్ని గూర్చి, ఆ కార్యక్రమాల్లో చంద్రమోహన్ పాల్గొని పంచుకున్న మాటలను గూర్చి గుర్తు చేసుకున్నారు.
కళాతపస్వి కె. విశ్వనాథ్ తనయుడు చంద్రమోహన్ కు బంధువులు అయిన కాశీనాధుని నాగేంద్ర మాట్లడుతూ తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న అపురూప బంధాన్ని తలచుకున్నారు.
రాధిక మంగిపూడి సభా నిర్వహణ గావించగా, అమెరికా నుండి ప్రముఖ గాయని శారద ఆకునూరి, హైదరాబాదు నుండి హాస్యబ్రహ్మ శంకర నారాయణ, ప్రముఖ రచయిత్రి కేవీ కృష్ణకుమారి, ఆంధ్ర కళావేదిక ఖతార్ అధ్యక్షులు వెంకప్ప భాగవతుల, కువైట్ నుండి తెలుగు సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు సుధాకర్ కుదరవల్లి, సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య నుండి మల్లేష్, అనిల్ కడించర్ల, ఉమామహేశ్వరరావు, మలేషియా నుండి సత్య దేవి మల్లుల తదితరులు పాల్గొని చంద్రమోహన్ కి ఘన నివాళులు అర్పించారు.



తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







