72 శాతం తగ్గిన విమాన ఛార్జీలు!
- December 04, 2023
యూఏఈ: కోవిడ్ -19 మహమ్మారి తర్వాత విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే, యూఏఈ నుండి అనేక గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు 2022తో పోల్చితే ఈ సంవత్సరం 72 శాతం తగ్గుదల నమోదైంది. "ధరలు డైనమిక్‌గా ఉంటాయి. అయితే విమానయాన సంస్థలు ప్రయాణికుల కోసం పోటీపడుతున్నందున చాలా ఆఫర్లు ప్రకటిస్తున్నారు." అని ట్రావెల్ సెర్చ్ ఇంజిన్ మరియు ఏజెన్సీ స్కైస్కానర్లో పనిచేసే హ్యూ ఐట్కెన్ తెలిపారు. ఏజెన్సీ యొక్క ట్రావెల్ ట్రెండ్స్ 2024 నివేదిక ప్రకారం.. గత సంవత్సరంతో పోల్చితే 2023లో యూఏఈ నుండి అతిపెద్ద విమాన ఛార్జీలు తగ్గిన గమ్యస్థానాలలో యునైటెడ్ స్టేట్స్‌లోని ఓర్లాండో (72 శాతం), మాలే, మాల్దీవులు (58 శాతం), రోమ్, ఇటలీ (52 శాతం), మ్యూనిచ్, జర్మనీ (47 శాతం), బ్యాంకాక్, థాయిలాండ్, అంటల్య, టర్కియే, ఇండోనేషియాలోని బాలిలో 17 -23 శాతం మధ్య ధర తగ్గింది. 2023 Q4లో యూఏఈ నుండి విమాన ప్రయాణాలు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 31 శాతం పెరిగాయి. ఈ శీతాకాలపు సెలవుల్లో ప్రయాణానికి డిమాండ్ పెరుగుతుందని ట్రావెల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూఏఈ ఆధారిత ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ ముసాఫిర్ మాట్లాడుతూ.. గత నాలుగు నెలల్లో ప్రధాన ప్రపంచ గమ్యస్థానాలకు విమాన ఛార్జీలలో తగ్గింపు కనిపించిందన్నారు. సెప్టెంబర్‌లో, గత నెలలతో పోలిస్తే విమాన ఛార్జీలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయని, సగటున, విమాన ఛార్జీలు 15-20 శాతం తగ్గాయని ఏజెన్సీలోని ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ రషీదా జాహిద్ తెలిపారు. మెరుగైన డీల్‌ల కోసం ముందుగా ప్లాన్ చేసుకుని బుక్ చేసుకోవాలని ఆమె నివాసితులకు సూచించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష