దోహాలో జిసిసి సమ్మిట్.. గాజా వివాదంపై చర్చ
- December 05, 2023
దోహా: ఖతార్ రాజధాని దోహాలో జరగనున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) రాష్ట్రాల సుప్రీం కౌన్సిల్ 44వ శిఖరాగ్ర సమావేశంలో గాజా వివాదం, ఈ ప్రాంతంలోని ఇతర ప్రధాన పరిణామాలపై చర్చించనున్నారు. ఇజ్రాయెల్ ముట్టడిలో ఉన్న గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైనికుల దౌర్జన్యం చేస్తున్న తరుణంలో జరగనున్న ఈ సమ్మిట్‌కు జిసిసిలోని ఆరు సభ్య దేశాల నాయకులు హాజరవుతారు. ప్రధాన అంతర్జాతీయ పరిణామాలపై కూడా నేతలు చర్చించనున్నారు. ఆదివారం జరిగిన జిసిసి విదేశాంగ మంత్రుల 158వ సన్నాహక సమావేశం సదస్సు ఎజెండాను ఖరారు చేసింది. మంత్రివర్గ సమావేశానికి హాజరైన సౌదీ ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ నాయకత్వం వహించారు. మంత్రివర్గ సమావేశానికి ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ అధ్యక్షత వహించారు జిసిసి రాష్ట్రాల విదేశాంగ మంత్రులు, జిసిసి సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్బుదైవి ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష