గ్రేడ్ 7 బాలుడి మిస్సింగ్ కేసును 8 గంటల్లో ఛేదించిన పోలీసులు

- December 06, 2023 , by Maagulf
గ్రేడ్ 7 బాలుడి మిస్సింగ్ కేసును 8 గంటల్లో ఛేదించిన పోలీసులు

దుబాయ్: దుబాయ్‌లో మంగళవారం మధ్యాహ్నం తప్పిపోయిన గ్రేడ్ 7 విద్యార్థిని దుబాయ్ పోలీసులు ఎనిమిది గంటల్లో ఛేదించారు. బాలుడి కుటుంబం దుబాయ్ పోలీసులకు.. సాయంగా నిలిచిన కమ్యూనిటీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. అర్ధరాత్రి దాటిన చిన్నారి ఆచూకీ లభించింది. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు అరేబియా రాంచ్‌లలోని సహేల్ గేట్ 1 వద్ద విద్యార్థి అదృశ్యమయ్యాడు. 
తప్పిపోయిన బాలుడి బంధువు దుబాయ్ పోలీసులకు సమచారం అందించారు. కమ్యూనిటీ సభ్యులు, డ్రోన్‌లు మరియు స్నిఫర్ డాగ్‌లను ఉపయోగించి సెర్చింగ్ ఆపరేషన్‌ను వేగంగా ప్రారంభించి, బాలుడి ఆచూకీని గుర్తించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com