విశాల్ భుజానికి తీవ్ర గాయం ..
- May 27, 2016
సినిమాల్లో యంగ్ హీరోలు డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్ చేస్తున్నారు. కాగా యాక్షన్ హీరో విశాల్ కూడా తన సినిమాల్లో యాక్షన్ సీన్స్ షూటింగ్ సమయంలో గతంలో రెండు మూడు సార్లు గాయపడి.. కొంత కాలం విశ్రాంతి కూడా తీసుకున్నాడు. కాగా విశాల్ తాజా సినిమా "కత్తి సండై" షూటింగ్ లో యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే...విశాల్ కొత్త సినిమా "కత్తి సండై" షూటింగ్ చెన్నైలోని ఓ షాపింగ్ మాల్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఓ ఫైటర్ విశాల్ మీద అటాక్ చేసే సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. విశాల్ భుజానికి తీవ్ర గాయం కావడంతో వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వైద్యులు విశాల్ కు కొన్ని రోజుల విశ్రాంతి అవసరం అని చెప్పారట. సూరజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంత టైనర్ లో నల్లనయ్య సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







