పూరీ, కళ్యాణ్ రామ్ ల సినిమాలో జగపతి బాబు..
- May 27, 2016
జగపతి బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాచి. ఈ సినిమా పూరీ సెకండ్ మూవీ కావడం విశేషం.. కాగా మొదటి సినిమాతో దర్శకుడిగా ఎంతమంచి పేరు సంపాదించాడో.. బాచి సినిమాతో అంతపేరు పోగొట్టుకున్నాడు. కాలక్రమంలో పూరీ టాప్ దర్శకుడిగా ఎదగగా... జగపతి బాబు ఫెడ్ అవుట్ అయ్యిన హీరోగా మిగిలాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన జగపతి బాబు సినిమా కెరీర్ హీరో కంటే చాలా స్పీడ్ గా ఉంది. పలు సినిమాల ఆఫర్లు అందుకొంటున్న జగపతి బాబు తాజాగా పూరీ జగన్నాథ్, నందమూరి కళ్యాణ్ రామ్ ల సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు.. అందుకోసం పూరీ స్పెషల్ కేర్ పెట్టి ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనున్నది. కాగా పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ జగపతి బాబు పూరీ కలిసి ఈ సినిమా చేయనున్నారు. a
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







