గాజాలో తక్షణ కాల్పుల విరమణకు యూఏఈ డిమాండ్
- December 08, 2023
యూఏఈ: గాజాలో తక్షణ కాల్పుల విరమణను చేపట్టాలని ఐరాస భద్రతా మండలికి కొత్త తీర్మానాన్ని సమర్పించినట్లు యూఏఈ ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈ తన తాజా ముసాయిదా తీర్మానంలో యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో తీవ్ర సంక్షోభానికి ప్రతిస్పందనగా తక్షణ మానవతావాద కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. "గాజా స్ట్రిప్‌లో పరిస్థితి విపత్తు మరియు కోలుకోలేని స్థితికి దగ్గరగా ఉంది. మేము వేచి ఉండలేము. మానవతావాద కాల్పుల విరమణను డిమాండ్ చేయడానికి కౌన్సిల్ నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది" అని UNకు యూఏఈ మిషన్ X లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ..పాలస్తీనా ప్రజల అధ్వాన్నమైన బాధల పట్ల ఐక్యరాజ్యసమితి స్పందించాలని సూచిస్తూ తీర్మానం సమర్పించినట్లు వెల్లడించారు. యూఏఈ మిషన్ దాని ముసాయిదా తీర్మానానికి అరబ్, OIC (ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్) గ్రూప్ మద్దతు ఉందని పేర్కొన్నారు. UNలోని 22 దేశాల అరబ్ గ్రూప్ కాల్పుల విరమణకు గట్టిగా మద్దతుగా నిలిచాయి. కానీ ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన అమిరాక భద్రతా మండలిలో వీటో అధికారం కలిగి ఉంది. కాల్పుల విరమణకు అది మద్దతు ఇవ్వలేదు.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







