ఇ-కామర్స్ వ్యాపారాల కోసం యూఏఈలో కొత్త చట్టం

- December 08, 2023 , by Maagulf
ఇ-కామర్స్ వ్యాపారాల కోసం యూఏఈలో కొత్త చట్టం

యూఏఈ: ఎమిరేట్స్‌లో వ్యాపార వాతావరణం పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో యూఏఈలో కొత్త ఇ-కామర్స్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్లా అహ్మద్ అల్ సలేహ్ మాట్లాడుతూ.. యూఏఈ స్థిరత్వం, ఆవిష్కరణ మరియు వ్యవస్థాపక ఆలోచనలను దాని ప్రధాన స్తంభాలుగా కలిగి ఉన్న కొత్త ఆర్థిక నమూనాకు క్రమంగా మారుతోందన్నారు. "ఈ-కామర్స్ కోసం కొత్త చట్టాన్ని ప్రకటించడం ద్వారా స్థిరమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలలో మేము కొత్త మైలురాయిని చూస్తున్నాము." అని  పేర్కొన్నారు.  అధునాతన సాంకేతికతలు, దేశంలో స్మార్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా వాణిజ్య వృద్ధిని ప్రేరేపించడం ఈ చట్టం లక్ష్యం అని తెలిపారు. ప్రపంచ అత్యుత్తమ పద్ధతులకు అనుగుణంగా దేశంలో ఆధునిక సాంకేతిక మార్గాల ద్వారా నిర్వహించబడే వాణిజ్యం కోసం శాసన మరియు నియంత్రణ వాతావరణాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త చట్టం ఒక సమగ్ర ఫ్రేమ్‌వర్క్ అని వివరించారు.  ఫెడరల్ డిక్రీ-లా నెం. 14 ఆఫ్ కామర్స్ త్రూ మోడరన్ మీన్స్ ఆఫ్ టెక్నాలజీ (ఇ-కామర్స్) డిజిటల్ మార్పు కోసం యూఏఈ తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com