సఖిర్‌లో అసాధారణ పొగమంచు

- December 09, 2023 , by Maagulf
సఖిర్‌లో అసాధారణ పొగమంచు

బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని సఖిర్ మరియు దాని పరిసర ప్రాంతాలలో అసాధారణంగా పొగమంచు ఆవరించింది. దీని కారణంగా కొన్ని గవర్నరేట్‌లలో విజిబిలిటీ బాగా తగ్గింది. అయితే, పొగమంచు నేపథ్యంలో స్థానిక బైక్ రైడర్లు ఖాళీ రోడ్లపై విన్యాసాలు చేయడం ఆందోలన కలిగిస్తుంది. మరోవైపు తగ్గిన దృశ్యమానత కారణంగా నివాసితులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా రోడ్డు భద్రత గురించి ముఖ్యంగా యువతలో అవగాహన పెంచుతోంది అంతర్గత మంత్రిత్వ శాఖ. బహ్రెయిన్‌లో బైక్ రైడర్‌లు చేసే ప్రమాదకరమైన విన్యాసాలకు సంబంధించి ఆందోళనలు కలిగిస్తున్నాయి. పొగమంచు అటువంటి కార్యకలాపాలకు ఆకర్షణీయమైన నేపథ్యాన్ని అందించినప్పటికీ, నిర్లక్ష్య ప్రవర్తన తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com