అల్ ఐన్ లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

- December 09, 2023 , by Maagulf
అల్ ఐన్ లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

యూఏఈ: శీతాకాలం అధికారికంగా డిసెంబర్ 21 తర్వాత మాత్రమే ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ చల్లని గాలుల తీవ్రత ఇప్పటికే ప్రారంభమైంది. యూఏఈ వాతావరణ విభాగం శుక్రవారం నాడు 8.8°C అత్యల్ప ఉష్ణోగ్రతలను నమోదు చేసింది. అల్ ఐన్ రక్నా ప్రాంతంలో ఈ ఉదయం 6.45 గంటలకు అత్యల్ప ఉష్ణోగ్రతను నమోదు చేసినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) వెల్లడించింది. గత కొన్ని రోజులుగా, అల్ ఐన్‌లోని ఇతర ప్రాంతాల్లో పాదరసం 10°C నుండి 11°C వరకు ఉంటుందన్నారు. డిసెంబరు 5న రక్నా ఎడారిలో ఇది 10°C మార్కు కంటే తక్కువగా పడిపోయిందని తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com