అందరి కంటే ముందే నాగ్.! ‘నా సామిరంగ’ .!
- December 09, 2023
నాగార్జున తాజా మూవీ ‘‘నా సామి రంగ’. ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగార్జున. సంక్రాంతి బరిలో ఈ సినిమా వుండబోతున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ఓ హింట్ ఇచ్చేశారు. అయితే, సంక్రాంతి బరిలో ఇప్పటికే పెద్ద సినిమా ‘గుంటూరు కారం’ రిలీజ్కి సిద్ధంగా వుంది.
అలాగే, వెంకటేష్ కూడా ‘సైంధవ్’ సినిమాతో సిద్ధంగా వున్నారు. మరికొన్ని సినిమాలు సంక్రాంతి బరిలో నిలవగా.. తాజాగా నాగార్జున వాళ్లందరి కంటే ముందే ఫ్యాన్స్కి సంక్రాంతి పండగను తీసుకొచ్చేయబోతున్నారట.
జనవరి 10, లేదా 11 తేదీల్లో ‘నా సామిరంగ’ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 12 వ తేదీన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే 13న వెంకటేష్ ‘సైంధవ్’గా రానున్నారు.
ఇక, నాగార్జున 10, లేదా 11 తేదీలను లాక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ టార్గెట్ రీచ్ అయ్యేలానే సినిమాని శరవేగంగా పూర్తి చేస్తున్నారట. ఈ సినిమాలో ఆషికా రంగనాధ్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఈ నెల 10 వ తేదీన ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.
అన్నట్లు ఈ సినిమాకి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణి సంగీతమందించడం విశేషం.
తాజా వార్తలు
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!







