రవితేజను పక్కన పెట్టేసిన డైరెక్టర్.?

- December 09, 2023 , by Maagulf
రవితేజను పక్కన పెట్టేసిన డైరెక్టర్.?

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌కి సెపరేట్ క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ ట్రాక్ రికార్డు వుంది.

గోపీచంద్ మలినేనిని డైరెక్టర్‌గా ఇండస్ర్టీకి పరిచయం చేసిన ఘనత మాస్ రాజా రవితేజది. ఆ తర్వాత వరుసగా ఈ కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలూ సూపర్ హిట్స్ అయ్యాయ్.

లేటెస్ట్‌గా రవితేజ సెకండ్ ఇన్నింగ్స్‌‌లో ‘క్రాక్’ హిట్ కొట్టింది కూడా ఇదే కాంబో. ఇంత మంచి ట్రాక్ రికార్డున్న ఈ కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమాని ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందించాల్సి వుంది. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనీ తెలుస్తోంది.

ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాదు కానీ, ఇదే కాన్సెప్ట్‌ని హీరోని మార్చేసి, గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారనీ మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారంలో నిజమెంత.?

గోపీచంద్ మలినేని, రవితేజ మధ్య మంచి స్నేహ సంబంధం వుంది. ఒకసారి ఒక హీరోతో కమిట్ అయిన ప్రాజెక్ట్.. అదీ రవితేజ వంటి స్టార్ హీరో ప్రాజెక్ట్‌ని మరో హీరోతో తెరకెక్కించడమేంటీ.? ఇప్పుడిదే ఇండస్ర్టీలో హాట్ టాపిక్. చూడాలి మరి, జస్ట్ ఇది గాసిప్ మాత్రమేనా.? లేదంటే, నిజమేనా.?

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com