నల్లద్రాక్షతో జుట్టు రాలడం తగ్గుతుందా.?

- December 11, 2023 , by Maagulf
నల్లద్రాక్షతో జుట్టు రాలడం తగ్గుతుందా.?

నల్ల ద్రాక్షలు చాలా మందికి ఇష్టం వుండవు. కానీ, కొందరయితే ప్రత్యేకంగా ఇష్టపడి తింటుంటారు ఈ ద్రాక్ష పండును. కొద్దిగా పులుపు, తీపి కలగలిపిన రుచిలో వుండే నల్ల ద్రాక్షలు ఆరోగ్యానికి చాలా చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు.

రెగ్యులర్‌గా నల్ల ద్రాక్షలు తీసుకునే వారి చర్మం నిగనిగలాడుతూ మెరుస్తుందట. అలాగే వ‌ృద్ధాప్య ఛాయలు సైతం లేట్‌గా వస్తాయని కొన్ని సర్వేల్లో తేలింది. అందుకే రెగ్యులర్‌గా నల్ల ద్రాక్షలు తినడం వల్ల, నిత్య యవ్వనంతో కనిపిస్తారట.

అలాగే, ఊబకాయం రాకుండా కూడా నల్లద్రాక్షలు కాపాడుతాయట. ఈ ద్రాక్షలో వుండే ఫ్లేవనాయిడ్లు గుండె జబ్బు నుంచి మనల్ని కాపాడుతాయని అంటున్నారు. రక్తంలోని షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేయడంలోనూ నల్ల ద్రాక్షలు సహాయ పడతాయట.

అన్నింటికీ మించి జుట్టు సంరక్షణలో నల్ల ద్రాక్షల పాత్ర అత్యంత కీలకమని చెబుతున్నారు. జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, నల్లగా నిగనిగలాడాలన్నా నల్ల ద్రాక్షలు తినడం కంపల్సరీ. చుండ్రు తదితర జుట్టు సమస్యలకు నల్ల ద్రాక్షలు మంచి పరిష్కారంగా చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com