IPL 2024 వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితా విడుదల..

- December 11, 2023 , by Maagulf
IPL 2024 వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితా విడుదల..

దుబాయ్: దుబాయ్‌ వేదికగా ఈ నెల 19న జరిగే ఐపీఎల్‌ 2024 వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది.

77 స్లాట్‌ల కోసం (47 స్లాట్‌లు భారత్‌ ఆటగాళ్ల కోసం, 30 స్లాట్‌లు విదేశీ ఆటగాళ్ల కోసం) జరిగే ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు (ఇద్దరు అసోసియేట్‌ దేశాల ఆటగాళ్లు కలుపుకుని) ఉన్నారు.

మొత్తం జాబితాలో 116 మంది క్యాప్డ్‌ ప్లేయర్స్‌ కాగా.. 215 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్‌, ఇద్దరు అసోసియేట్‌ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో 23 మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల బేస్‌ ధర విభాగంలో పేర్లు నమోదు చేసుకోగా.. 13 మంది రూ. 1.5 కోట్ల బేస్ ధరలో తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు. ఈ వేలం భారతకాలమానం ప్రకారం.. డిసెంబర్‌ 19న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.

సెట్‌ నంబర్ 1: హ్యారీ బ్రూక్, ట్రవిస్‌ హెడ్, కరుణ్ నాయర్‌, మనీష్ పాండే, రోవ్‌మన్‌ పావెల్, రిలీ రొస్సో, స్టీవ్‌ స్మిత్

సెట్‌ నంబర్‌ 2: గెరాల్డ్‌ కోయెట్జీ, పాట్‌ కమిన్స్, వనిందు హసరంగా, డారిల్ మిచెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్షల్ పటేల్‌, రచిన్ రవీంద్ర, శార్దూల్‌ ఠాకూర్, క్రిస్‌ వోక్స్

సెట్‌ నంబర్‌ 3: కేఎస్‌ భరత్‌, జోస్‌ ఇంగ్లిస్‌, కుశాల్‌ మెండిస్‌, ఫిలిప్‌ సాల్ట్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌

సెట్‌ నంబర్‌ 4: లోకీ ఫెర్గూసన్, జోష్‌ హాజిల్‌వుడ్, అల్జరీ జోసఫ్‌, మధుషంక, శివమ్‌ మావి, చేతన్‌ సకారియా, మిచెల్‌ స్టార్క్, జయదేవ్‌ ఉనద్కత్, ఉమేష్ యాదవ్‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com