టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామాను ఆమోదించని గవర్నర్‌

- December 12, 2023 , by Maagulf
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామాను ఆమోదించని గవర్నర్‌

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళిసై ఆమోదించలేదు. సోమవారం జనార్దన్‌ రాజీనామాను ఆమోదించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని రాజ్‌భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. నిన్న సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో గవర్నర్‌ తమిళిసై ఉన్నారు.

కాగా, ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో బాధ్యులు ఎవరో తెలియకుండా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించకూడదని గవర్నర్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకులకు బాధ్యులను చేస్తూ డీవోపీటీకి గవర్నర్ లేఖ రాయడంతో తమిళి సౌ సౌందర్ రాజన్ ప్రశ్నాపత్రం లీకేజీలో బాధ్యులెవరో తెలిసేంత వరకూ రాజీనామాను ఆమోదించకూడదని నిర్ణయించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com