అడవి శేష్‌తో శృతిహాసన్.!
- December 12, 2023
యంగ్ హీరో అడవి శేష్‌తో స్టార్ హీరోయిన్ అయిన శృతి హాసన్ జత కట్టబోతోందట. హీరోగా యంగ్ టాలెంట్ అయినప్పటికీ అడవి శేష్ మల్టీ టాలెంటెడ్. నటనతో పాటూ, టెక్నికల్‌గా బాగా సౌండున్న కుర్రోడు.
ఇండస్ర్టీలో పలువురు ప్రముఖ సెలబ్రిటీలతో మంచి స్నేహ సంబంధాలున్నాయ్ అడవి శేష్‌కి. తాజాగా ఓ సినిమా కోసం అడవి శేష్, శృతి హాసన్ జత కట్టబోతున్నారట. ఇదో డిఫరెంట్ టిపికల్ కాన్సెప్ట్ మూవీ అని తెలుస్తోంది.
‘క్షణం’, ‘గూఢచారి’ వంటి తన సక్సెస్ ఫుల్ మూవీస్‌కి సినిమాటోగ్రఫర్‌గా పని చేసిన షనీల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు.
అన్నపూర్ణ బ్యానర్‌లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందబోతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఇదిలా వుంటే, ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో బడా ప్రాజెక్ట్ ‘సలార్’ వుంది. డిశంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వెరీ లేటెస్ట్‌గా ‘హాయ్ నాన్న’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది శృతి హాసన్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







